Jai Sri:manna:rayana,

Sri:mathe: Ra:ma:nuja:ya namaha

Priya Bha:gavatho:ththamula:ra…!

With the divine sankalpa of Sri Sri Sri Tridandi Chinna Srimannarayana Ramanuja Jeeyar Swamiji, the inauguration ceremony of Statue of Equality, Bhagavad Ramanuja will take place with great glory from 2-02-2022 to 14-02-2022.

We are celebrating this 1000 years festivity with 1035 kunda Sri Lakshmi: Na:ra:yana maha: ya:ga. This maha: yajna is an opportunity to all the devotees belonging Sri Vaishnava families for taking part as an overseer, chant manthras as ho:tha, priests and more.

If you already have experience in such yajna, please fill the form and submit it. There is also an opportunity to get trained either through online class or in person class, and then take part in the yajna. Upon examining the desire and the qualifications, we will be able to get you registered for training. Accordingly, please complete the form at the latest by 30-11-2021. The classes will begin on 8-12-2021. More details will be shared with you after you send the completed form.

We will need to be following the below rules without fail

  • You must reach Divya Saketham premises two days before the ya:ga
  • You must be prepared to stay at the accommodation provided near the ya:ga bhu:mi by carrying with you all your essentials for all the 12 days.
  • Whoever is nominated to be upadrasta, ho:tha or ruthwik will need to be completely aware of the event.
  • Whoever is taking part in the pa:ra:yana, you must have complete authority over the scriptures.
  • You must carry any medication that you need.
  • You must follow the protocols throughout the event, including when there are VIPS
  • You cannot use the mobile phone during ya:ga.
Jai Sri:manna:ra:yana
FOR DETAILS IN TELUGU

జై శ్రీమన్నారాయణ
శ్రీమతే రామానుజాయ నమః
ప్రియ భాగవతోత్తములారా …. !

  • శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి దివ్య సంకల్పంతో రూపు దిద్దుకున్న 216 అడుగుల సమతా మూర్తి భగవద్రామానుజుల వారి విగ్రహ ఆవిష్కరణ 2-02-2022 నుండి 14-02-2022 అత్యంత వైభవోపేతంగా జరగనున్నది.
  • 1000 సంవత్సరాల ఈ పండుగను 1035 కుండములతో విశ్వశాంతి శ్రీలక్ష్మీ నారాయణ మహా యాగముగ నిర్వహించుకుంటున్నాం.
  • ఈ మహాయజ్ఞంలో ఉపద్రష్టలుగ, హోతలుగ,ఋత్విక్కులుగ సత్ సంప్రదాయ శ్రీ వైష్ణవ వంశ పరంపరకు చెందిన భాగవతోత్తములకు ఈ మహాయజ్ఞం అవకాశం కలిగిస్తోంది.
  • ఇది వరకే ఇందులో ప్రవేశం కలిగినవారు తమ సంసిద్ధతా పత్రాలను క్రింద చూపించిన క్రమములో నింపి పంపవలెను.
  • ఈ అపురూప మహాయాగం లో పాల్గొని శిక్షణ పొందాలి అనే రుచికలిగిన వారికి ఆన్ లైన్ లో కాని, నేరుగా కాని శిక్షణ ఇచ్చి పాల్గొనే అవకాశం కలిగించాలని అనుకుంటోంది ఈ మహాయజ్ఞం.
  • ఎవ్వరినైనా వారి వారి రుచి, యోగ్యతలను పరిశీలించి ఆ తరువాత మాత్రమే ఆధికారికంగ కార్యక్రమములో పాల్గొనే గుర్తింపు పత్రాన్ని అందజేస్తుంది.
  • శ్రద్ధాళువులందరూ కూడా ఈ పత్రాన్ని పూర్తిగా నింపి పంపగలరు. పత్రము అందవలసిన చివరి తేదీ 30-11-2021
  • 08-12-2021 నుండి శిక్షణ తరగతులు ప్రారంభమగును.

ఈ క్రిందికొన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ వేడుకలో అందరం పాల్గొందాం…

  • యాగమునకు కనీసం రెండు రోజుల ముందుగానే దివ్య సాకేతం ప్రాంగణం వద్దకు చేరుకోవాలి.
  • యాగ భూమి సమీపంలోనే అందరికీ వసతి ఏర్పాటు చేయబడును కావున ప్రతి ఒక్కరూ 12 రోజుల సమయమును పూర్తిగా గడిపేటట్లుగా మన కార్యక్రమాలను అన్నిటిని సిద్ధ పరచుకునే రావలెను.
  • ఉపద్రష్టలుగ, హోతలుగ, ఋత్విక్కులుగ వచ్చేవారు యాగ కార్యక్రమం పట్ల పూర్తి అవగాహనతో ఉండవలెను.
  • పారాయణలలో అన్వయించేవారు కూడా తమతమ గ్రంథముల యందు సంపూర్ణ అధికారులై ఉండవలెను. గ్రంథములతో పాటుగా రావలెను.
  • మీ ఆరోగ్యానికి సంబంధించిన ఓషధులను కూడా వెంటబెట్టుకుని రాగలరు.
  • అతి ముఖ్యమైన విశిష్ట అతిథులు, ప్రముఖులు విచ్చేయనున్న సందర్భంలో ప్రోటోకాల్‌ నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉండును.
  • యాగ సమయంలో మొబైల్ ఫోన్ వాడరాదు.

జైశ్రీమన్నారాయణ

Likes